NEWSNATIONAL

స‌త్యాన్ని ఏ శ‌క్తి ఆప‌లేదు – కేజ్రీవాల్

Share it with your family & friends

మాజీ సీఎంను క‌లిసిన స‌త్యేంద్ర జైన్

ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కేసులో 873 రోజుల పాటు సుదీర్ఘ జైలు జీవితం గ‌డిపిన త‌న స‌హ‌చ‌రుడు, మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఢిల్లీ కోర్టు జ‌డ్జి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇన్ని రోజులైనా మోపిన నేర అభియోగాల‌కు సంబంధించి ఆధారాలు స‌మ‌ర్పించ లేక పోయింది. ఒక వ్య‌క్తిని ఇన్ని రోజుల పాటు జైలులో ఉంచ‌డం ఒక ర‌కంగా మంచిది కాదు.

విడుద‌ల చేస్తేనే మంచిద‌ని నా అభిప్రాయం. అందుకే బెయిల్ ను మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆప్ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ అయితే నిప్పులు చెరిగారు . ప్ర‌ధాన‌మంత్రి మోడీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కుట్ర‌లు పార లేద‌న్నారు. చివ‌ర‌కు ధ‌ర్మ‌మే గెలిచింద‌ని అన్నారు.

ఇదిలా ఉండ‌గా జైలు నుంచి విడుద‌లైన వెంట‌నే స‌త్యేంద‌ర్ జైన్ నేరుగా త‌మ అధినాయ‌కుడైన అర‌వింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న‌ను ఆలింగ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆప్ నుంచి న‌లుగురు సీనియ‌ర్ నేత‌లు జైలుకు వెళ్లి వ‌చ్చారు. వారిలో మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ తో పాటు స‌త్యేంద‌ర్ జైన్ ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌త్యాన్ని ఏ శ‌క్తులు నిలువ‌రించ లేవ‌ని అన్నారు.