NEWSNATIONAL

ప‌నులు కాకుండా అడ్డుకున్న కేంద్రం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ ను దుమ్ము దులిపారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ఉండేలా త‌మ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గురువారం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆప్ ప్ర‌భుత్వాన్ని లేకుండా చేయాల‌ని ప్లాన్ చేశారని, చివ‌ర‌కు త‌న‌ను, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు స‌త్యేంద్ర జైన్ ను జైలుకు పంపించార‌ని, కానీ వారి కుట్ర‌లు వ‌ర్కవుట్ కాలేద‌ని మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్బంగా ఢిల్లీ స‌ర్కార్ కు నిధులు ఇవ్వ‌కుండా, ప‌నులు చేప‌ట్ట‌కుండా అడ్డుకుంటే ప్ర‌జ‌ల నుంచి ఆప్ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ, షా, జేపీ న‌డ్డా ప్లాన్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కానీ వారి ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు. ఈ సంద‌ర్బంగా తాను కొద్ది రోజుల కింద‌ట ఒక సీనియ‌ర్ బీజేపీ లీడ‌ర్ ను క‌లిశాన‌ని చెప్పారు. త‌న‌ను అరెస్ట్ చేయ‌డం వ‌ల్ల మీకు వ‌చ్చే లాభం ఏమిట‌ని ప్ర‌శ్నించాన‌ని ఈ సంద‌ర్బంగా త‌న పేరు బ‌య‌ట‌కు చెప్ప వ‌ద్ద‌ని కోరార‌ని తెలిపారు మాజీ సీఎం.

వారి ప్లాన్ ఒక్క‌టే ప్ర‌జ‌ల ప‌నులు కాకుండా అడ్డుకోవ‌డం త‌ప్పితే మ‌రోటి కాద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్.