యోగికి పదవీ గండం ఖాయం
అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నానా రకాలుగా దుర్భాషలాడుతూ కామెంట్ చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
తనను అనే ముందు నీ సంగతి చూసుకో అంటూ హితవు పలికారు. ఎన్నికలు అయి పోయాక యోగికి పదవీ గండం తప్పదన్నారు. ముందు నీకు తాను శత్రువు కాదని నీకంటూ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే నీ పక్కనే ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నేనని సంచలన ఆరోపణలు చేశారు.
లోక్ సభ ఎన్నికల వరకే యూపీ సీఎంగా ఉంటావని, ఆ తర్వాత యోగికి పదవీ గండం తప్పదన్నారు సీఎం. ఇప్పటి నుంచే కుట్రలు కూడా స్టార్ట్ చేశారంటూ పేర్కొన్నారు కేజ్రీవాల్. ఇకనైనా తన గురించి మాట్లాడటం మానేస్తే మంచిదని సూచించారు .
జూన్ 4న భారత సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. భారత దేశాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు అరవింద్ కేజ్రీవాల్.