పేరెంట్స్ తో అరవింద్ కేజ్రీవాల్
ఇంకా ఎంత కాలం ఈ వేధింపులు
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగో లేదని, వారికి ఈ సమయంలో తాను దగ్గర ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఫోటోలను కూడా షేర్ చేశారు.
పరిస్థితులను అర్థం చేసుకోకుండా కేవలం వేధింపులకు గురి చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. రాజకీయంగా తనను ధైర్యంగా ఎదుర్కోలేక దొడ్డి దారిన కేసులు నమోదు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
వృద్దులైన తన తండ్రి, తల్లిని ప్రతి రోజూ ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని తాను కోర్టుకు కూడా తెలియ పర్చడం జరిగిందన్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు నకు పాల్పడుతోందని ఆరోపించారు.