పంజాబ్ కు రూ. 9 వేల కోట్లు బంద్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కావాలని బీజేపీ సర్కార్ పంజాబ్ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పంజాబ్ సర్కార్ కు రావాల్సిన రూ. 9,000 కోట్ల రూపాయలను నిలిపి వేసిందని ధ్వజమెత్తారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. మోడీ తన ఇంటి నుంచి డబ్బులను ఇవ్వడం లేదన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో సంపాదించిన డబ్బులను పన్నుల రూపంలో కడుతున్నారని అన్నారు సీఎం.
ఏదో తాను సంపాదించి ఇస్తున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ నరేంద్ర మోడీని ఏకి పారేశారు. ఒకవేళ రూ. 9 వేల కోట్లను మంజూరు చేసి ఉంటే తమ ఆప్ సర్కార్ ప్రతి గ్రామంలో రోడ్లు, క్లినిక్ లు నిర్మించే వాళ్లమని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. మోడీ సర్కార్ ప్రజలను ఎందుకు ఇంతగా ద్వేషిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు సీఎం.