జైలుకు వెళ్లినా ప్రశ్నిస్తూనే ఉంటా
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ చెరసాలకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను గట్టి బందోబస్తు మధ్య తీహార్ జైలుకు తరలించారు.
జైలుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితో తనను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. చివరకు సత్యం గెలుస్తందన్నారు. అక్రమ కేసులు బనాయించడం మోడీ సర్కార్ కు అలవాటుగా మారిందన్నారు.
ఈ దేశంలో బీజేపీ మాత్రమే పాలించాలని, మిగతా పార్టీలకు ఆ హక్కు లేకుండా చేయాలని అనుకుంటున్నారని కానీ ఇది జరగని పని అని హెచ్చరించారు. తనను జైలులో ఉంచినా మోడీని, షాను ప్రశ్నిస్తూనే ఉంటానని, ఆప్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు సీఎం.