NEWSNATIONAL

బీజేపీ కుట్ర‌లు ఫ‌లించవు

Share it with your family & friends

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ల‌ను ఏకి పారేశారు. వారు కావాల‌ని త‌న‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. జాతీయ మీడియా సంస్థ పీటీఐతో కేజ్రీవాల్ సంభాషించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో త‌న‌ను కావాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఇంట్లో ప‌లుమార్లు సోదాలు చేప‌ట్టార‌ని , ఒక్క రూపాయి కూడా అద‌నంగా దొర‌క‌లేద‌ని ఈ విష‌యాన్ని కోర్టు కూడా ప్ర‌శ్నించింద‌ని చెప్పారు.

మోడీ, అమిత్ షా గ‌త ప‌దేళ్లుగా త‌న‌ను ప‌డ‌గొట్టాల‌ని, త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేయాల‌ని చూశార‌ని కానీ వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు. త‌న‌ను జైలుకు పంపించాక ఆప్ స‌ర్కార్ కూల్చాల‌ని చూశార‌ని , కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఏవీ ప‌లించ లేద‌న్నారు కేజ్రీవాల్.

విచిత్రం ఏమిటంటే త‌న అరెస్ట్ త‌ర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యింద‌న్నారు. ఇక త‌న‌ను బ‌ల‌హీన ప‌ర్చ‌డంలో భాగంగానే స్వాతి మ‌లివాల్ను పావుగా వాడుకున్నార‌ని ఆరోపించారు.