ఆంజనేయా కేజ్రీవాల్ ను రక్షించవా
హనుమంతుడి సన్నిధిలో సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పురాతన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కన్నాట్ ప్లేస్ లోని పురాతనమైన ఆంజనేయుడి గుడిలోకి ప్రవేశించారు.
హనుమంతుడు సర్వ శక్తి సంపన్నుడని పేర్కొన్నారు. అందరికీ మేలు జరిగేలా చూడాలని, తన భర్త ను అకారణంగా మోదీ ఇరికించారని వాపోయారు. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ విడుదల అయ్యేలా చూడాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు సునీతా కేజ్రీవాల్.
ఎలాంటి ఆధారాలు లేకుండా తన భర్తను కావాలని ఇరికించారని ఆరోపించారు. ఈ దేశంలో న్యాయ స్థానాలు ఉన్నాయని, నిజాలు త్వరలోనే తేలుతాయని అన్నారు సునీతా కేజ్రీవాల్. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన మోదీకి జనం తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇంకెంత కాలం మతం పేరుతో రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించారు.
తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని , తనకు నమ్మకం ఉందన్నారు. అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు పొందేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు.