హసీనాకు ఆశ్రయం ఓవైసీ ఆగ్రహం
బంగ్లాదేశ్ కు మద్దతు ఇవ్వక పోతే ఎలా
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఆగస్టు 15న గురువారం ఓవైసీ మీడియాతో మాట్లడారు.
ఆయన ప్రత్యేకంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యవహారంపై మండిపడ్డారు. ఆమెను ఎందుకు ఇండియాలో ఉండేందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పూర్తిగా నేరమన్నారు ఓవైసీ.
ఈ సందర్బంగా తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నానని..బంగ్లాదేశ్ ప్రజలకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. పదవీ నుంచి వైదొలిగిన షేక్ హసీనాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ నిలదీశారు ఓవైసీ.
రేపు బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాను తిరిగి ఇవ్వమని చెబితే మీరు ఏమి చేస్తారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ , ఎంపీ. ఇది పూర్తిగా అక్కడి దేశ ప్రజలను అవమానించడమే అవుతుందని అన్నారు ఓవైసీ.