ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో క్రికెట్ ఒక మతం కంటే ఎక్కువగా ప్రభావం చూపుతోందన్నాడు. పేదరికం నుంచి వచ్చిన ఆటగాళ్లు ఇవాళ కళ్ల ముందే కరోడ్ పతులుగా మారి పోతున్నారని, ఇదంతా క్రికెట్ వల్లనే కలుగుతోందన్నాడు. ఇదే సమయంలో భారత్ లో క్రికెట్ కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని, ఇందు కోసం ప్రయత్నం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. విరాట్ కోహ్లీ సూపర్ ప్లేయర్ అని, తనలాంటి ఆటగాళ్లు భారత దేశంలో చాలా మంది ఉన్నారని అన్నాడు.
చిట్ చాట్ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన మహమ్మద్ అజారుద్దీన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. తాను కూడా క్రికెట్ ఆడానని, కానీ అజ్జూ భాయ్ లాంటి క్రికెటర్ ను తాను ఇంత వరకు చూడలేదన్నాడు. ఫ్లిక్ షాట్స్ ఆడడంలో ఇప్పటి వరకు పుట్టలేదన్నాడు. అయితే రాజకీయ పరంగా తనతో విభేదాలు ఉన్నప్పటికీ ఆట పరంగా చూస్తే మాత్రం అజారుద్దీన్ సూపర్ హీరో అన్నాడు ఓవైసీ. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ ఇవాళ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. ప్రోత్సహిస్తే కోహ్లీ లాంటి ఆటగాళ్లకు ఇండియాలో కొదవే లేదన్నాడు ఎంపీ.