అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్
దేశాన్నిసెక్యులరిస్టులు పాలిస్తున్నారు
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతీయ మీడియా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలపై స్పందించారు. ఎవరు సెక్యులరిస్టులనే దానిపై మాట్లాడే వారు ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు ఎంపీ.
ఇది మంచి పద్దతి కాదన్నారు. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను రెచ్చ గొట్టడం మానుకోవాలని సూచించారు అసదుద్దీన్ ఓవైసీ. ఇది ఎంత మాత్రం సమాజానికి, దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
ఈ దేశం అందరిదీ. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని ఈ విషయాన్ని డాక్టర్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగంలో పొందు పర్చబడి ఉందన్నారు. సెక్యులర్లు ప్రతి చోటా ఉన్నారని చెప్పారు ఎంపీ. ఒక రంగం అనేది కాదు ప్రతి రంగంలోనూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని పేర్కొన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
సెక్యులర్లు ఎక్కడ లేరని కాదు..రాజకీయాలలో, భద్రతా దళాలలో, న్యాయ వ్యవస్థలో, కార్పొరేట్ ప్రపంచంలో, మీడియాలో ప్రతి చోటా వారు కలిసే ఉన్నారని, ఈ దేశ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు ఎంపీ.