ఏఐఏడీఎంకేతో ఎంఐఎం పొత్తు
బీజేపీది చిల్లర రాజకీయం
హైదరాబాద్ – గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెమటోడ్చుతున్నారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పాత బస్తీని జల్లెడ పట్టారు. ప్రస్తుతం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి విరించి ఆస్ప్రతి యాజమాన్యం చైర్మన్ కొంపెల్లి మాధవీలతతో పోటీ పడుతున్నారు. గతంలో కంటే ఈసారి పోటీ మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు.
ఇది పక్కన పెడితే బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిని ఏరి వేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు మాధవీలత. అలాంటిది ఏమీ లేదని, తమ కుటుంబం ముందు నుంచీ హైదరాబాద్ తో అనుబంధం కలిగి ఉందన్నారు ఓవైసీ.
ఏఐఏడీఎంకేతో తాము పొత్తు కొనసాగిస్తామని, తమిళనాడులో తాము కూడా బరిలో ఉంటామని స్పష్టం చేశారు ఎంఐఎం చీఫ్. వచ్చే ఎన్నికల్లో తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ధోరణితో ఉంటామన్నారు ఓవైసీ.