అన్నాడీఎంకేతో ఎంఐఎం పొత్తు
ప్రకటించిన పార్టీ చీఫ్ ఓవైసీ
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో తాము ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని చెప్పారు. తమ పార్టీకి చెందిన రాష్ట్ర చీఫ్ టీఎస్ షకీల్ అహ్మద్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళని స్వామితో భేటీ అయ్యారని చెప్పారు. అయితే తాము ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోమంటూ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నారు.
ఇదిలా ఉండగా అన్నాడీఎంకే అభ్యర్థులకు ఓట్లు వేయాలని తమిళనాడు ప్రజలను తాము కోరుతున్నామని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. అన్నాడీఎంకే పార్టీతో తమ పొత్తు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందన్నారు.
కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలను నెరుపుతున్న బీజేపీకి, ఎన్డీయేకు షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.