ఎంఐఎం చీఫ్ ఓవైసీ
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, మంచి దోస్త్ అంటూ కితాబు ఇచ్చారు.
పచ్చి రాజకీయ అవకాశ వాది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు ఓవైసీ. గతంలో మోడీ గురించి అనరాని మాటలు అన్న బాబు అప్పుడే మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టెర్రరిస్టు (ఉగ్రవాది) అని కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు ఎవరి ప్రయోజనాల కోసం మోదీ కాళ్లు మొక్కారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ.
బీజేపీ అవకాశ వాద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో జగన్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ.