ఐదేళ్లు ప్రశాంతంగా పని చేసుకో
హైదరాబాద్ – నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ఇప్పుడు దోస్తానా నడుస్తోంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది వాస్తవం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన ఓ మొండి ఘటం అని పేర్కొన్నారు. పట్టుదలతో తను ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించాడని, ఈ సందర్భంగా తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ పరంగా పూర్తి సపోర్ట్ ఇచ్చేందుకు సిద్దంంగా ఉన్నామని తెలిపారు.
ఇక రేవంత్ రెడ్డి నిశ్చింతగా ఉండవచ్చని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించు కోవచ్చంటూ చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. పాతబస్తీలో అభివృద్ది పనులకు సంబంధించి నిధులు అడిగితే వెంటనే భారీ ఎత్తున మంజూరు చేశారని , ఈ సందర్బంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు ఓవైసీ.