రేవ్ పార్టీతో సంబంధం లేదు
నటి ఆషి రాయ్ కామెంట్స్
హైదరాబాద్ – బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు నటి ఆషి రాయ్. తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. బర్త్ డే పార్టీ ఉందంటే వెళ్లానని అంతకు తప్పించి తనకు ఏమీ తెలియదన్నారు.
ఇదిలా ఉండగా రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొన్నారని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరికీ డ్రగ్స్ టెస్టు చేపట్టామన్నారు. పరీక్షలు చేపట్టిన తర్వాత 86 మందికి టెస్టులలో పాజిటివ్ ఉన్నట్టు తేలిందన్నారు .
ఇదిలా ఉండగా టాలీవుడ్ కు చెందిన నటులు హేమ, ఆషి రాయ్ తో పాటు శ్రీకాంత్ మేఖ కూడా పాల్గొన్నంట్లు చెప్పారు దయానంద్. వీరందరికీ నోటీసులు పంపించింది సీసీబీ. ఇదిలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలపై మరోసారి స్పందించారు ఆషి రాయ్ సింగ్. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.