అశుతోష్ శర్మ అదుర్స్
ముంబై బౌలర్లకు షాక్
పంజాబ్ – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు కంటి మీద కునుకే లేకుండా చేశాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ క్రికెటర్ అశుతోష్ శర్మ. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే నాలుగు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో స్కోర్ బోర్డును మెల మెల్లగా పెంచే ప్రయత్నం చేశారు యంగ్ క్రికెటర్లు శశంక్ సింగ్ , అశుతోష్ శర్మ.
శశాంక్ 41 రన్స్ చేసి కీలకమైన పాత్ర పోషిస్తే చివరి రెండు ఓవర్లు ఉండగా అశుతోష్ సిక్స్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శర్మ 61 విలువైన పరుగులు చేశాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు .
ఇందులో 2 ఫోర్లు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు శర్మ ముంబై బౌలర్లకు. తను క్రీజులో ఉన్నంత వరకు ముంబైకి చెమటలు పట్టాయి. ఒకానొక దశలో చేతిలోకి వచ్చినట్టే వచ్చి పోతుందేమోనన్న ఆందోళన కెప్టెన్ పాండ్యాలో కనిపించింది. చివరకు రనౌట్ తో పంజాబ్ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ మ్యాచ్ మాత్రం అభిమానులను ఉర్రూత లూగించేలా చేసింది. చివరి దాకా ఉత్కంఠను రేపింది.