రాజ్యసభ సభ్యుడిగా అశ్విని వైష్ణవ్
ప్రతిపాదించిన బీజేపీ..మద్దతిచ్చిన సీఎం
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ పరంగా రాజ్యసభ సభ్యులను ప్రకటించింది. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు ఒడిశా రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కొలువు తీరిన రైల్వే శాఖ మంత్రిగా పదవి చేపట్టిన అశ్విని వైష్ణవ్ కు అరుదైన అవకాశం ఇచ్చింది.
తమ పార్టీ తరపున రాజ్యసభకు అభ్యర్థిగా నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా రాష్ట్రం నుండి మూడు స్థానాలను గెలుచు కోవడానికి కావాల్సిన బలం బీజేడీకి ఉంది. సీఎం అశ్విని వైష్ణవ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్.
మరో వైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రాజ్యసభ కోసం అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ కు ఛాన్స్ ఇచ్చారు.
కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నామినేట్ అయ్యారు. ఇదే సమయంలో ఏఐసీసీ రాజ్యసభ్య కోసం నలుగురిని ఎంపిక చేసింది. వీరిలో రాజస్థాన్ నుంచి ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఖరారు చేసింది. తెలంగాణ నుంచి సభ్యులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.