మంధాన అదుర్స్ రిచా సూపర్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్
దంబుల్లా – మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతమూ రసవత్తరంగా మారింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ప్రత్యర్థి శ్రీలంక జట్టు ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది.
భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన మరోసారి అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. తనదైన శైలిలో ఈ టోర్నీలో సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ లో కూడా అదే జోరు కొనసాగించారు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా కేవలం 38 బంతులు మాత్రమే ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశారు.
తాజాగా ఆదివారం జరిగిన కీలక ఫైనల్ పోరులో దుమ్ము రేపారు స్మృతీ మంధాన. షఫాలీ వర్మతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ జట్టు తరపున మంధాన 47 బంతులు ఎదుర్కొని 60 పరుగులు చేసింది. ఇక మరో మహిళా బ్యాటర్ రిచా ఘోష్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని 30 రన్స్ చేసింది.
ఇక వీరితో పాటు జెమీమా రోడ్రిగ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. తను 29 పరుగులు చేయగా శ్రీలంక జట్టు తరపున కవిషా దల్హరి 2 వికెట్లు తీయగా సచిని నిసంసాలా, చమరి చెరో వికెట్ తీశారు.