బీజేపీకి ఢోకా లేదు – హిమంత
400 సీట్లు రావడం పక్కా
అస్సాం – సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగే లేదని స్పష్టం చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 543 సీట్లకు గాను తమ పార్టీకి 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు.
సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వానికి జనం మద్దతు ఇవ్వడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి బిగ్ షాక్ తప్పదన్నారు హిమంత బిస్వా శర్మ. తాము పవర్ లోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దేవాలయాలను పునరుద్దరిస్తామని అన్నారు.
మధుర, కాశీలో కూడా భారీ ఎత్తున గుళ్లను నిర్మిస్తామని చెప్పారు. సివిల్ కోడ్ ను తప్పకుండా అమలు చేస్తామన్నారు అస్సాం సీఎం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి భారత దేశంలో విలీనం చేసుకుంటామని ప్రకటించారు .
తాము ఇచ్చిన మాట ప్రకారం అయోధ్య లో రామ మందిరాన్ని నిర్మించడం జరిగిందన్నారు. బీజేపీ మాట ఇవ్వదని ఇచ్చిందంటే తప్పదని చెప్పారు హిమంత బిస్వా శర్మ.