శ్రీతేజ్ కు వేణు స్వామి ఆర్థిక సాయం
కోలుకునేందుకు హోమం చేస్తా
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. బాబు త్వరగా కోలుకోవాలని ఈవారంలో మృత్యుంజయ హోమాన్ని తన స్వంత ఖర్చులతో చేస్తానని అన్నారు. బుధవారం బాధితుడిని పరామర్శించారు వేణు స్వామి.
ఈ సందర్భంగా తండ్రి భాస్కర్ కు తన వంతుగా రూ. 2 లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. గతంలో కంటే ఇప్పుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందవద్దని సూచించారు. తాను ఇప్పటి దాకా వెయ్యి సినిమాలకు ముహూర్తం పూజలు చేశానని చెప్పారు. సినీ రంగానికి సంబంధించి తన వంతు బాధ్యతతో ఈ సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా నటుడు అల్లు అర్జున్ జాతకం ఈనెల 29 వరకు బాగో లేదన్నారు వేణు స్వామి. మరో వైపు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి..ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇవాళ పరామర్శించారు. కొరియోగ్రాఫర్ల తరపు నుంచి శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.