బన్నీ జాతకం బాగోలేదు
జ్యోతిష్కుడు వేణు స్వామి
హైదరాబాద్ – ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోందన్నారు. అందుకే నటుడు అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు వేణుస్వామి. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని, తనకు ఈనెల 29 వరకు బాగుండదని , చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. ఆ దేవుడి దయ వల్ల సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి , చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న శ్రీతేజ్ పరిస్థితి కొంచెం మేలు అన్నారు. త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. సినీ ఇండస్ట్రీతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు.
కలియుగంలో డబ్బులు ఎక్కడుంటే రిస్క్ అక్కడ ఉంటుందన్నారు వేణు స్వామి. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఎవరూ కావాలనుకొని చేసింది కాదన్నారు. దీనిని మానవతా దృక్ఫథంతో అర్థం చేసుకోవాలని సూచించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ మృత్యుంజయ మహా యాగం చేస్తానని ప్రకటించారు.