అమిత్ షా కాళ్లు మొక్క లేదు
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు
అమరావతి – ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతకు తాము బీజేపీ వద్దకు వెళ్లలేదని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పిలిస్తేనే వెళ్లామని, అమిత్ షా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని , అధికారం పోతుందన్న బెంగతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఫేక్ ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు అచ్చెన్నాయుడు. రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు కింజారపు అచ్చెన్నాయుడు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత వైఎస్ జగన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం పక్కా అని జోష్యం చెప్పారు.