NEWSANDHRA PRADESH

మత్స్యకారులకు చేయూతను అందిస్తాం – మంత్రి

Share it with your family & friends

గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించు కోలేద‌ని ఆరోపణ

విజ‌య‌వాడ – మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు.

మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి, భద్రత కోసం మత్స్య రంగంలో ఎదురవుతునన క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రతి ఏటా నవంబర్ 21 న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ష తీర ప్రాంతం 1020 కిమీ, 2.26 లక్షల హెక్టార్ల ఆక్వా కల్చర్ అనేక నీటి వనరులను కలిగి ఉందన్నారు. దేశంలో 75 శాతం కంటే ఎక్కువ కల్చర్ రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, భారతదేశం యెక్క ఆక్వా హబ్ గా నిలుస్తుందన్నారు.

ఆక్వా రంగానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుందన్నారు. దశాబ్దాల నుంచి మత్స్యకారులకు దివంగ‌త‌ ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు అండగా నిలిచార‌ని, ఆ వరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు.

మత్స్యకారులకు రాజకీయంగా ప్రముఖ స్థానం కల్పించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్రం నుంచి నిధులను కూడా పొందలేక పోయారన్నారు.

అంతే కాకుండా 217 జీవో ను తెచ్చి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేరన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి 30 కిలోమీటర్ కు ఒక హార్బర్ కాని ఒక జెట్టీ కాని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటే మత్స్యకారులకు మేలు కలుగుతుందన్నారు.