జగన్ ఆందోళన భగ్గుమన్న అచ్చెన్న
ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రాలేదు
అమరావతి – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఛీ కొట్టినా జగన్ రెడ్డికి బుద్ది రాలేదన్నారు. ఇప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఫేక్ రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ అని మండిపడ్డారు. తన పాలనా కాలంలో ఏపీని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ప్రజా ప్రభుత్వం అరాచకపు లెక్కలన్నీ సరి చేస్తుందని హెచ్చరించారు. పాలనను గాడిలో పెట్టే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారని చెప్పారు.
జగన్ రెడ్డిని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా మారక పోవడం దారుణమన్నారు. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ మంత్రి. పవర్ పోయినా ఇంకా ఏపీకి సీఎంగా ఉన్నట్లు జగన్ రెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీనే పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.