సాక్ష్యాలు లేకున్నా అరెస్ట్ లు ఎలా..?
ఆప్ మంత్రి అతిషి షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఇప్పటికే ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ , మంత్రి సత్యేంద్ర జైన్ లను అకారణంగా జైలులో వుంచారని, ఏం సాధించారో చెప్పాలన్నారు అతిషి .
ఎంపీ సంజయ్ సింగ్ ను సైతం చెరసాలలో ఆరు నెలల పాటు బంధించారని , ఇదే విషయంపై కోర్టు సీరియస్ కామెంట్స్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఎందుకు అరెస్ట్ చేశారనే విషయంపై ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వివరణ ఇవ్వలేక పోయిందని గుర్తు చేశారు అతిషి.
ఇప్పటి వరకు ఈడీ సమర్పించిన నివేదికలో ఎక్కడా డబ్బులు దొరికినట్లు పేర్కొన లేదని ఈ విషయం స్పష్టమైందన్నారు. 16 రోజులు గడిచినా ఈడీ ఎన్ని సమన్లు పంపించిందో చెప్పాలని నిలదీసింది. ఎంత మందిని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు అతిషి.
అప్రూవర్ గా మారిన మద్యం వ్యాపారి శరత్ చంద్రా రెడ్డి భారీ ఎత్తున ఎలోక్టరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ముట్ట చెప్పడం వల్లనే ఆయనను విడుదల చేసిందని సంచలన ఆరోపణలు చేసింది.