ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్
ప్రతిపాదించిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. తాను తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆప్ కీలక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కేజ్రీవాల్ చెప్పినట్టుగానే తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు . తన స్థానంలో ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ పని చేస్తారని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రభుత్వం క్లిష్ట సమయంలో అండగా నిలిచారు అతిషి సింగ్. ఆమె ఒక్కత్తే సర్కార్ ను కంట్రోల్ చేయగలిగారు. పాలనా పరంగా, పార్టీ పరంగా పోరాటం చేయడంలో, సమస్యలను ఎత్తి చూపడంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పటి వరకు అతిషి సింగ్ ఢిల్లీ ఆప్ కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. సమర్థవంతంగా తనకు అప్పగించిన మంత్రి పదవిని నిర్వహించారు. దీంతో ఎవరు తదుపరి సీఎం అవుతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు ఆప్ బాస్.
తన వారసురాలు అతిషి సింగ్ అంటూ వెల్లడించారు. షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ పీఠంపై ఓ మహిళ ముఖ్యమంత్రిగా కొలువు తీరడం విశేషం.