మలివాల్ కేసు వెనుక బీజేపీ కుట్ర
ఏసీబీ ఇప్పటికే విచారణ చేపట్టింది
న్యూఢిల్లీ – ఆప్ సీరియస్ గా స్సందించింది. కేవలం తమను బద్నాం చేసేందుకే ఈ నాటకం ఆడారంటూ మండిపడింది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. కేవలం ఆప్ ను ఇరికించడం కోసమే ఇలా చేసిందని ఆరోపించారు .
చిల్లర రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటేనంటూ మండిపడ్డారు. డిసిడబ్ల్యులో కాంట్రాక్టు ఉద్యోగుల అక్రమ రిక్రూట్మెంట్పై బిజెపికి చెందిన అవినీతి నిరోధక బ్యూరో శాఖ స్వాతి మలివాల్‌పై కేసు పెట్టిందన్నారు.
ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారని తెలిపారు. దోషిగా నిర్ధారించే సమయం రాబోతోందని దీనిని అడ్డం పెట్టుకుని స్వాతి మలివాల్ ను పావుగా వాడుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి దాకా ఆమె ఆప్ మనిషిగా ముద్ర పడ్డారు. అంతలోపే తాము ఎలా పరాయి వారమవుతామో చెప్పాలన్నారు అతిషి.
ఇదంతా కావాలని చేసిన కుట్ర తప్ప మరేమీ కాదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ కు సంబంధించి పూర్తి వీడియోను తాము విడుదల చేశామన్నారు. ఇలాంటి చిల్లర పనులు బీజేపీ చేస్తుందని ముందు జాగ్రత్తగా భద్ర పర్చడం జరిగిందని చెప్పారు.