మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు
బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ – వివాదాస్సద నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. మీడియాపై దాడి చేసిన ఘటనలో బీఎన్ఎస్ 118 కింద ఇదివరకే కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. కాగా దానిని 109 సెక్షన్ కింద హత్యా యత్నంగా మారుస్తూ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కావాలని తన తండ్రి దాడి చేయలేదని వివరణ ఇచ్చారు కొడుకు మంచు విష్ణు. అయితే మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు రాష్ట్ర సమాచార , రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉండగా రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇదిలా ఉండగా మోహన్ బాబు తనయులు మంచు మనోజ్, మంచు విష్ణు విచారణ నిమిత్తం రాచకొండ సీపీ సుధీర్ బాబు ను కలిశారు.
ఇద్దరి నుంచి రూ . 1 లక్ష చొప్పున బాండు తీసుకున్నారు. మోహన్ బాబు ఇంట్లో ఏ ఘటన జరిగినా ఇద్దరూ బాధ్యత వహించాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీపీ.