వెల్లడించిన ఏడీఆర్ సంస్థ
అమరావతి – దేశంలోనే అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. 72 తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 89 కేసులు నమోదు చేశారు. మొత్తం 31 మంది సీఎంలలో ఎక్కువ కేసులు కలిగిన సీఎంగా చెత్త రికార్డును నమోదు చేశారు. ఈ విషయాన్ని నేషనల్ ఎలక్షన్ వాచ్ వెల్లడించింది.
విచిత్రం ఏమిటంటే అత్యధిక సంపన్నులు కలిగిన ముఖ్యమంత్రుల జాబితాను కూడా ప్రకటించింది ఏడీఆర్. దేశంలోనే రూ.931 కోట్లతో తొలి స్థానంలో నిలిచారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం నిలవగా , మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉన్నారు.
ఇక అత్యంత పేద సీఎంగా మరోసారి ఆఖరు స్థానంలో నిలిచారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.