16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం
సంచలనం నిర్ణయం తీసుకున్ని ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా – ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కీలక ప్రకటన చేశారు ఆ దేశ ప్రధానమంత్రి ఆల్బనీస్. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియా చూపుతున్న విషపు ప్రభావం గురించి ప్రత్యేకంగా చర్చించారు. 16 ఏళ్ల లోపు బాల, బాలికల కోసం నిషేధించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయానికి ఆస్ట్రేలియా లోని పలు రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది సర్కార్. ప్రధానంగా సోషల్ మీడియా యువ ఆస్ట్రేలియన్లకు సామాజిక హానీ చేస్తోందని పేర్కొంది. సమావేశం అనంతరం ఆసిస్ పీఎం అల్బనీస్ మీడియాతో మాట్లాడారు.
తమ దేశానికి సంబంధించి యువతీ యువకుల భద్రత, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు పీఎం.
ఆస్ట్రేలియాలోని రాష్ట్రాలు భూభాగాలు ఏకగ్రీవంగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నిరోధించాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు.
ఇక నిషేధించిన వాటికి సంబంధించి సోషల్ మీడియాకు చెందిన ఎక్స్ , ఇన్ స్టా గ్రామ్ , యూట్యూబ్ , లింక్డ్ ఇన్ తో పాటు ఫేస్ బుక్ , వాట్సాప్ ఉన్నాయి.