సీఎంతో ఆష్ట్రేలియా హై కమిషనర్ భేటీ
జ్ఞాపికను బహూకరించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను సాదరంగా ఆహ్వానించారు. తమ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా సీఎం ఫిలిప్ గ్రీన్ కు హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి కూడా ఉన్నారు. అంతకు ముందు సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆస్ట్రేలియన్ కమిషనర్ చర్చించారు.
ప్రధానంగా తెలంగాణలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలు, వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపైనా విస్తృతంగా చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని కోరారు సీఎం .