మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
ఆస్ట్రేలియా – ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఎట్టకేలకు మ్యాచ్ నిషేధం నుంచి తప్పించుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా విరాట్ కోహ్లీకి, కాన్ స్టాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తనపై ఆడకుండా బ్యాన్ చేస్తారని అనుకున్నారు. కానీ కోహ్లీకి ఊరటనిస్తూ కేవలం 20 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
కాగా విరాట్ కోహ్లి ఉద్దేశ పూర్వకంగానే బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో సామ్ కాన్స్టాప్ట్ తో గొడవ పడినట్లు తేలింది. ఈ వివాదం క్రికెట్ రంగంలో తీవ్ర వివాదానికి దారితీసేలా చేసింది.
ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ కోహ్లీపై చర్య తీసుకోవద్దంటూ ఐసీసీకి విన్నవించారు. మ్యాచ్ రిఫరీ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించారు. చివరకు కోహ్లీకి ఊరటను ఇస్తూ బిగ్ రిలీఫ్ ఇచ్చారు. కేవలం జరిమానా విధించి వదలేశారు. ప్రస్తుతం భారత జట్టు ఐదు టెస్టుల మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ప్రస్తుతం భారత్ జట్టు నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.