స్టార్ ఆసిస్ క్రికెటర్ సంచల నిర్ణయం
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది బలమైన ఆస్ట్రేలియా. ఈ బాధ నుంచి కోలుకోక ముందే ఆ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సంచలన ప్రకటన చేశాడు. తాను వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తప్పుకోవడం ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. తాజాగా ఈ టోర్నీలో ఆసిస్ జట్టుకు స్కిప్పర్ గా వ్యవహరించాడు.
ఇదిలా ఉండగా స్టీవ్ స్మిత్ 2010 సంవత్సరంలో వన్డేలోకి వచ్చాడు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు పునాదిలా ఉన్నాడు. అద్భుతమైన పాత్ర పోషించాడు. ఎన్నో కీలక మ్యాచ్ లలో జట్టు గెలుపొందడంలో చురుకుగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 169 వన్డే మ్యాచ్ లు ఆడాడు.
43 సగటుతో 5727 రన్స్ చేశాడు. ఇందులో 12 శతకాలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతే కాదు 2015లో , 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసిస్ జట్టులో భాగస్వామిగా ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే 2023లో ఫైనల్ లో భారత్ ను ఓడించింది సదరు టీం.