ఆటో రిక్షా కదిలే తోట
ఈ డ్రైవర్ వెరీ స్పెషల్
మహబూబాబాద్ – మనసుంటే మార్గాలు ఎన్నో. కొందరు భిన్నంగా ఆలోచిస్తారు. ఇతరులకు స్పూర్తిగా నిలుస్తారు. రోజు రోజుకు యాంత్రికత డామినేట్ చేస్తున్న తరుణంలో పర్యావరణం కనిపించకుండా పోతోంది. ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకే భవంతులు కనిపిస్తున్నాయి. దీంతో పచ్చదనం రాను రాను కరువవుతోంది.
ఈ సమయంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ సంచలనంగా మారారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఎవరైనా బతికేందుకు ఆలోచిస్తారు. కానీ తను మాత్రం పది మందికి ఉపయోగపడేలా, వారిలో స్పూర్తి కలిగించేలా ప్రయత్నం చేశాడు .
ఇంతకీ ఆటో డ్రైవర్ ఎవరంటే పేరు అంజి. ఇతనిది స్వస్థలం మహబూబాద్. తన రిక్షాను ఏకంగా చిన్న తోటగా మార్చేశాడు. అంటే అర్థం తన ఆటో రిక్షాను కదిలే తోటగా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆటో టాప్ పై తోటను పెంచాడు అంజి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాన్ని వేస్తూ పర్యారణాన్ని పాడు చేస్తున్న వారంతా ఈ ఆటో డ్రైవర్ ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది కదూ.