NEWSANDHRA PRADESH

అవినాష్ రెడ్డి ఆస్తులు రూ. 40 కోట్లు

Share it with your family & friends

గ‌త ఎన్నిక‌ల్లో రూ. 18.6 కోట్లు మాత్ర‌మే

క‌డ‌ప జిల్లా – వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు భారీ ఎత్తున పెరిగాయి. విచిత్రం ఏమిటంటే గ‌తంలో 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల‌తో ఈ ఏడాది ఎన్నిక‌ల‌తో పోలిస్తే దాదాపు 116 శాతం పెరిగిన‌ట్లు తేలింది.

ఇప్ప‌టికే ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి బ‌హిరంగంగానే అవినాష్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. త‌న చిన్నాన్న‌ను పొట్ట‌న పెట్టుకున్న‌ది అత‌డేన‌ని మండిప‌డ్డారు. ఇది ప‌క్క‌న పెడితే 2024 నాటికి త‌న ఆస్తుల విలువ రూ. 40 కోట్లు అని ఎంపీ పేర్కొన్నారు త‌న అఫిడ‌విట్ లో.

2019లో ఆయ‌న ఆస్తుల విలువ రూ. 19.6 కోట్లుగా ఉండ‌గా ఈసారి మ‌రింత రెట్టింపు పెర‌గ‌డం విశేషం. తాజాగా పేర్కొన్న ఆస్తుల ప‌రంగా చూస్తే రూ. 7.5 కోట్ల చ‌రాస్తులు ఉండ‌గా రూ. 32.8 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి.

అంతే కాదు ఎంపీ అవినాష్ రెడ్డి వ‌ద్ద రూ. 23 ల‌క్ష‌ల విలువైన 355 గ్రాముల బంగారం ఉంది. ఆయ‌న జీవిత భాగ‌స్వామి వ‌ద్ద రూ. 85 ల‌క్ష‌ల విలువైన 1.3 కిలోల బంగారం ఉందని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హ‌త్య కేసుతో పాటు మ‌రో 2 క్రిమిన‌ల్ కేసులు అవినాష్ రెడ్డిపై న‌మోదై ఉన్నాయి.