అయోధ్య ట్రస్టు సభ్యులకు అవగాహన
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడి
తిరుమల – భక్తుల రద్దీ క్రమ బద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు అవగాహన కల్పించింది టీటీడీ. ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతో పాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అయోధ్యలోని శ్రీ రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలో అవగాహన కల్పించారు.
ఇదిలా ఉండగా అయోధ్య రామమందిరం ట్రస్ట్ క్యూ నిర్వహణలో టీటీడీ సాంకేతిక పరమైన సహాయ సహకారం అందించాలని ఈ సందర్బంగా కోరింది. యొక్క సాంకేతిక సహాయాన్ని కోరింది. ఇదిలా ఉండగా భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణపై అవగాహన కల్పించారు.
ట్రస్టు ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ బలరాముడి ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు.
క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు బలరాముని దర్శనం చేసి ప్రసాదాలు అందజేశారు.
అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డిఎస్ఎన్ మూర్తి, టిటిడి సాంకేతిక సలహాదారు జి. రామచంద్ర. రెడ్డి, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈలు. బాబు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.