ప్రకటించిన ఢిల్లీ కేపిటల్స్ యాజమాన్యం
ఢిల్లీ – ఈ ఏడాది జరిగే టాటా ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ గా ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. గతంలో ఈ జట్టుకు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ స్కిప్పర్ గా వ్యవహరించాడు. పటేల్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో కీలకమైన పాత్ర పోషించాడు అక్షర్ పటేల్. దీంతో తమ జట్టుకు తనే బెస్ట్ ఛాయిస్ అంటూ స్పష్టం చేసింది ఢిల్లీ మేనేజ్మెంట్. కాగా ఈ ఏడాది జరిగిన వేలం పాటలో రిషబ్ పంత్ ను భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
కాగా ఇదే వేలం పాటలో కేఎల్ రాహుల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం భారీ ధరకు బిడ్డింగ్ లో పాల్గొంది. అయితే తన కెప్టెన్సీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. కాగా 2019 నుంచి ప్రాంఛైజీతో ఉన్న గుజరాత్ కు చెందిన ఆల్ రౌండర్ పై డీసీ నమ్మకం ఉంచింది. నలుగురు ఆటగాళ్లలో అక్షర్ పటేల్ ఒకడు. వీరిలో కుల్దీప్ యాదవ్, స్టబ్స్ , అభిషేక్ పోరేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా బీసీసీఐ మాజీ చీఫ్ , భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. తన నిర్ణయం మేరకు అక్షర్ పటేల్ కు స్కిప్పర్ గా ఛాన్స్ దక్కినట్టు సమాచారం.