శ్రీరాముడి కోసం పోటెత్తిన భక్తజనం
కిట కిట లాడుతున్న అయోధ్య
ఉత్తర ప్రదేశ్ – యూపీలోని అయోధ్య లో కొలువు తీరిన రామ మందిరం భక్తలతో నిండి పోతోంది. రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు. దీంతో ఆలయ కమిటీ దర్శన వేళలను కూడా మార్చింది. అయినా ఎంతకూ తగ్గడం లేదు. దేశం నలు మూలల నుంచి తరలి వస్తున్నారు తండోప తండాలుగా.
ఇదిలా ఉండగా ఇటీవలే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ముఖ్య అతిథిగా అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. భారీ ఖర్చుతో దీనిని నిర్మించారు.
వేలాది మంది స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులకు అయోధ్య రామ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వారంతా అయోధ్యలో కొలువు తీరి స్వయంగా రాముడిని వీక్షించారు. ఆనాటి నుంచి నేటి దాకా భక్తుల సందడి మొదలైంది. తొలి రోజే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
ఇసుక వేస్తే రాలనంత భక్తులు స్వామి వారిని చూసేందుకు పోటీ పడ్డారు. ఇదిలా ఉండగా ఆలయ కమిటీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. లక్షలాది మంది రాబోయే రోజుల్లో శ్రీరాముడిని దర్శించు కుంటారని భావిస్తున్నారు.