DEVOTIONAL

అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధ పూజ

Share it with your family & friends

ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్తుల‌కు అన్న‌దానం

తిరుమ‌ల – ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమల లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ‌ వేంకటేశ్వరుని చిత్రప టాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న ప్రసాదాల త‌యారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు.

ఈ సంద‌ర్బంగా వెంక‌య్య చౌద‌రి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వేలాది మందికి నిత్యం అన్న‌దానం జ‌రుగుతోంద‌ని చెప్పారు. భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

ఏ ఒక్క‌రు ఆక‌లితో ఉండ కూడ‌ద‌నే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పెద్ద ఎత్తున అన్న‌, ప్ర‌సాదాల‌ను అంద‌జేస్తూ వ‌స్తోంద‌ని చెప్పారు వెంక‌య్య చౌద‌రి.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్ర‌త్యేకాధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.