NEWSANDHRA PRADESH

స్పీక‌ర్ గా అయన్న పాత్రుడు ఏక‌గ్రీవం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి

అమ‌రావ‌తి – ఆంధ్ర ప్ర‌దేశ్ శాస‌న స‌భ స్పీక‌ర్ గా చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని ప్రొటెం స్పీక‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.

అసెంబ్లీలో స్పీక‌ర్ ప‌ద‌వికి ప్ర‌తిప‌క్షం నుంచి కానీ కూట‌మి నుంచి కానీ ఎవ‌రూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. కూట‌మిలో భాగంగా ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ తో పాటు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌తిపాదించారు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును స్పీక‌ర్ ప‌ద‌వి కోసం.

తెలుగుదేశం పార్టీ నుంచి ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ , జ‌న‌సేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ ప్ర‌తిపాదించిన వారిలో సంత‌కం చేశారు.

చింత‌కాయల అయ్య‌న్న పాత్రుడును సీఎంతో పాటు మంత్రులు , ఎమ్మెల్యేలు ప్ర‌త్యేకంగా అభినందించారు.