మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
అమరావతి – మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మంత్రి రోజా, సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాను మీకు ఉన్నానంటూ హామీ ఇచ్చారు. గతంలో లేని విధంగా ఇవాళ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వాళ్లను కావాలని టార్గెట్ చేసిన జగన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు తాను నిద్ర పోనంటూ హెచ్చరించారు.
ఇక కొన్ని రోజులు మాత్రమే గడువు ఉందని, ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరన్నారు అయ్యన్న పాత్రుడు. ఆడుదాం ఆంధ్ర అంటూ ఎవరి కోసం పోటీలు నిర్వహించాలో చెప్పాలన్నారు. తమ ప్రచారం కోసం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
మనకు లోకేష్ బాబు, చంద్రబాబు ఉన్నారని రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం పక్కా అని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు అయ్యన్న పాత్రుడు. అంతే కాదు ఇవాళ జాతీయ , రాష్ట్ర స్థాయిలలో చేపట్టిన సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా గెలవ బోయేది మనమేనంటూ చెబుతున్నాయని ఇక ఢోకా లేదన్నారు అయ్యన్న పాత్రుడు.