NEWSANDHRA PRADESH

చింత‌కాయ‌ల‌కు లైన్ క్లియ‌ర్

Share it with your family & friends

ఏపీ స్పీక‌ర్ ఛాన్స్

అమరావ‌తి – టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న‌ను స్పీక‌ర్ గా నామినేట్ చేస్తూ ఎన్డీయే కూట‌మి త‌ర‌పున నారా లోకేష్ , ప‌వ‌న్ క‌ళ్యాణ్, కింజార‌పు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మ‌నోహ‌ర్ , ప‌య్యావుల కేశ‌వ్ , దూళిపాళ న‌రేంద్ర ప్ర‌తిపాదించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌ను శాస‌న స‌భ ఉన్న‌తాధికారికి స‌మ‌ర్పించారు.

గ‌తంలో చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న‌కు అపార‌మైన అనుభవం ఉంది. ప్ర‌త్యేకించి గ‌త ఐదేళ్ల కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త‌న ఇంటిపైకి పోలీసులు వ‌చ్చినా, అరెస్ట్ చేసినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు అయ్య‌న్న పాత్రుడు.

గ‌త వైసీపీ స‌ర్కార్ హ‌యాంలో అయ్య‌న్నపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. చివ‌ర‌కు త‌ను ఊహించ‌ని రీతిలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే విజ‌యం సాధించిన అనంత‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై. జ‌గ‌న్ ఇంకా చావ‌లేద‌ని చ‌చ్చే దాకా కొట్టాల‌ని పిలుపునిచ్చారు.