మాజీ మంత్రికి సీఎం చంద్రబాబు లైన్ క్లియర్
అమరావతి – అందరూ అనుకున్నట్టుగానే మాజీ మంత్రి , అనకాపల్లి శాసన సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఏపీ శాసన సభ స్పీకర్ గా ఎన్నిక కానున్నారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ పదవి కోసం తను నామినేషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం 175 స్థానాలకు గాను కూటమి ఏకంగా 164 స్థానాలు కైవసం చేసుకుని విస్తు పోయేలా చేసింది. దీంతో ఏపీ స్పీకర్ పదవి ఎన్నిక అనేది ఏకగ్రీవం , లాంఛనంగా మారనుంది.
విచిత్రం ఏమిటంటే తాజాగా కేబినెట్ లోకి అయ్యన్న పాత్రుడిని తీసుకుంటారని అంతా భావించారు. కానీ సభను నడపడంలో అనుభవం కలిగి ఉండడం అన్నది ముఖ్యం. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేబినెట్ లో చోటు దక్కుతుందని అనుకున్నారు.
ఇటు అయ్యన్నకు అటు గోరంట్లకు ఛాన్స్ లభించ లేదు. ఇద్దరి పేర్లు స్పీకర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గోరంట్లను ప్రొటెం స్పీకర్ వరకే పరిమితం చేశారు. కానీ అయ్యన్నను అందలం ఎక్కించారు . స్పీకర్ పదవికి ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు.