Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHస్పీక‌ర్ ను చేసి నోటికి తాళం వేశారు

స్పీక‌ర్ ను చేసి నోటికి తాళం వేశారు

అయ్య‌న్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ ఏపీకి చేసింది ఏమీ లేద‌ని, వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లాడ‌ని, వాటికి వడ్డీలు చెల్లించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని అన్నారు. అన‌కాప‌ల్లి జిల్లా క‌శింకోట‌లో రూ. 4.53 కోట్లతో చేప‌ట్టనున్న అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను జ‌గ‌న్ స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు.

కశింకోట పరమటమతల్లి టెంపుల్ రోడ్డు అంచనా విలువ 1.10 కోట్లు, గోపాలపురం చిన్న ముసలివాడ రోడ్డు అంచనా విలువ 1.47 కోట్లు, సంపతి పురం కసింకోట రోడ్డు అంచనా విలువ 1.96 కోట్లు రూపాయల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.

గ‌త ఐదేళ్లలో భయంకరమైన ప్రభుత్వాన్ని చూశాం ఆని అన్నారు. త‌న‌ను స్పీకర్ గా చేసిన సీఎం చంద్రాబాబు నాయుడు తన నోటికి ప్లాస్టర్ వేశారన్నారు. స్పీకర్ గా ఉన్న తాను వాస్తవాలు చెప్పకూడదా అంటూ ప్ర‌శ్నించారు.

తాను రాజకీయ వాదినని, ప్రజా నాయకుడినని, ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అయ్యానన్నారు. కొణతాల రామక్రష్ణ మంచి అనుభవం ఉన్న నాయకుడు ఆని ప్ర‌శంసించారు. కొణతాల ఏం చేస్తారో.. అదే మాట్లాడతారు.. ఏం మాట్లాడతారో.. దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments