జగన్ ను చచ్చే దాకా కొట్టాలి
అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ లో ప్రస్తుతం వైరల్ గా ఉన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం సాగించిన రాచరిక పాలన, ప్రత్యేకించి వైసీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్బంధ కాండ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన హయాంలో అయ్యన్న పాత్రుడు తీవ్రమైన వేధింపులకు గురయ్యాడు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆయన టీడీపీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదం కావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు విస్తు పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ షేర్ చేసింది.
మాజీ సీఎం జగన్ రెడ్డిని చంపేయాలని అనడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. జగన్ ఓడి పోయాడు..కానీ చావ లేదని, చచ్చే వరకు కొట్టాలని కసితో అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయనకు అపారమైన జన, కుల బలం ఉందంటూ పేర్కొన్నారు .