స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంస
అమరావతి – మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అరుదైన నేత అని కితాబు ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఆయన మృతికి సంతాప సూచకంగా జనవరి 1వ తేదీ వరకు సంతాప దినాలు ప్రకటించాయి కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.
ఈ సందర్బంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం సరి కాదన్నారు. దయచేసి తనకు ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని, నూతన ఏడాది శుభాకాంక్షలు తెలియ చేయవద్దని కోరారు. ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు.
1982-1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య సభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించారు. ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 1987లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు.
అంతే కాదు 1993లొ ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు అందుకున్నారు. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరా గాంధి దక్కింది. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు యావత్ భారత జాతి మొత్తం వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.