నా కొడుక్కే ఎంపీ టికెట్ ఇవ్వాలి
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు
అనకాపల్లి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల కూటమిలో సీట్ల పంచాయతీ సిగపట్లు పట్టుకునేంత దాకా వెళ్లింది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీని, ఆ పార్టీ బాస్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేస్తూ వచ్చారు అయ్యన్న పాత్రుడు.
ఆయన ఎప్పటికప్పుడు ప్రజల గొంతుకగా ఉన్నారు. వారి సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి అనకాపల్లి పార్లమెంట్ టికెట్ విషయంపై ప్రస్తుతం జోరుగా చర్చ కొనసాగుతోంది.
దీనిపై మంగళవారం అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఎంపీ టికెట్ పొందేందుకు, పోటీ చేసేందుకు తన కొడుక్కి పూర్తి అర్హత, అనుభవం ఉందన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీకి దిగుతామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. విజయవాడ, గుంటూరు వాళ్లకు టికెట్ ఇస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు అయ్యన్న పాత్రుడు.