అమెరికా లో ఘనంగా అయ్యప్ప పూజ
టెక్సాస్ లో మహాపడి పూజకు భక్తులు
అమెరికా – అయ్యా నిన్ను మరువను , అయ్యప్ప నిన్ను మరువను అంటూ అమెరికాలోని టెక్సాస్ లో హైదరాబాద్ కు చెందిన ఆనంద్ స్వామి తమ స్వగృహంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు. మహా పడి పూజ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తి సంస్కృతిని యుఎస్ లో పెంపొందిచేలా చేయడం పట్ల అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
స్వామి దీక్షను అత్యంత భక్తి శ్రద్దలతో చేపట్టారు. ఘనంగా భజన కార్యక్రమాలచే పూజ నిర్వహించారు. పురుషులతో పాటు మహిళలు సైతం హాజరయ్యారు. ఇక నుంచి ప్రతి ఏటా అయ్యప్ప స్వామికి పూజలు జరిపిస్తామని పేర్కొన్నారు.
వృత్తి రీత్యా అమెరికాకు వచ్చామని, ఇక్కడ కూడా భక్తులు అయ్యప్ప స్వామికి ఉన్నారని ఈ సందర్బంగా తెలిపారు ఆనంద స్వామి. గురుస్వామితో పాటు మాల ధారణ చేసిన స్వాములందరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం కలుగుతోందన్నారు.
ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచి పోకూడదనే తాము ఈ అరుదైన పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు అయ్యప్ప మాల ధరించిన ఆనంద స్వామి.