NEWSNATIONAL

క‌ర్ సేవా చీఫ్ కాల్చివేత‌

Share it with your family & friends

త‌ర్సేమ్ సింగ్ పై కాల్పులు

ఉత్త‌రాఖండ్ – ఉత్త‌రాఖండ్ లో కాల్పుల ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఉధ‌మ్ సింగ్ న‌గ‌ర్ లో బైక్ పై వ‌చ్చిన దుండ‌గులు నాన‌క్ మ‌ట్టా గురుద్వారా వ‌ద్ద క‌ర్ సేవా చీఫ్ బాబా త‌ర్సేమ్ సింగ్ ను కాల్చి చంపారు. టార్సెమ్ సింగ్ ఉదయం 6-30 గంటల ప్రాంతంలో నడక కోసం డేరా ప్రాంగణం నుండి బయటికి వ‌చ్చారు.

ఈ స‌మ‌యంలోనే అదును చూసి కాపు కాసిన గుర్తు తెలియ‌ని ముసుగు ధ‌రించిన దండుగులు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ బ‌డ్డారు. తీవ్ర గాయాల పాలైన తర్సేమ్ సింగ్ ను హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అంత లోపే మార్గ మ‌ధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. దీంతో చుట్టు ప‌క్క‌ల తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇద్ద‌రు బైక్ పై వ‌చ్చిన‌ట్లు , దాడికి పాల్ప‌డిన‌ట్లు సీసీటీవీ ఫుటేజ్ లో బ‌హిర్గ‌త‌మైంది. ఇదిలా ఉండ‌గా త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని, త‌న‌ను చంపేందుకు కుట్ర ప‌న్నుతున్నారంటూ ఇటీవ‌లే వాపోయారు బాబా త‌ర్సేమ్ సింగ్ . త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఇంత‌లోనే ఈ దారుణం చోటు చేసుకుంది.

కాల్పుల‌కు తెగ‌బ‌డిన వారి గురించి ఆరా తీస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు.